ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీలోకి మరో ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు - నందిగామ మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం - TDP Leading Nandigama Municipality - TDP LEADING NANDIGAMA MUNICIPALITY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 12:21 PM IST

TDP Leading in Nandigama Municipality: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఫుల్ జోష్​ మీద ఉన్న తెలుగుదేశం తన దృష్టిని నందిగామ మున్సిపాలిటీపై పెట్టింది. కూటమి సునామీతో ప్రభంజనం సృష్టించిన టీడీపీ అలవోకగా ఈ పురపాలక సంఘాన్ని చేజిక్కించుకుంది. ఎన్టీఆర్​ జిల్లాలోని నందిగామ పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ కైవసం అయింది. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు విశ్వనాథపల్లి వాణి, బాపట్ల సాంబయ్య టీడీపీలో చేరారు. 

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇద్దరు కౌన్సిలర్లకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో 20 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 6, జనసేన ఒకటి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు 13 చోట్ల విజయం సాధించారు. దీంతో నందిగామ మున్సిపాలిటీని అప్పట్లో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ముగ్గురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం మరో ఇద్దరు కౌన్సిలర్లు చేరటంతో  నందిగామ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి పూర్తి ఆధిక్యత వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details