ఎలాంటి ప్రకటన లేకుండా మార్కెట్ వేలంపాట - అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - palamaneru market auction
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 5:41 PM IST
TDP Leaders Who Blocked the Agricultural Market Auction : చిత్తూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలమనేరు పరిధిలోని శివుని కుప్పం ఉప మార్కెట్ స్థలం వేలంపాటను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఎలాంటి ప్రకటన, నోటీసు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా వారికి కావాల్సిన వారికే స్థలాన్ని కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులకు లక్షల్లో డబ్బులు తీసుకుని లైసెన్స్ జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం పలమనేరు వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తే, ప్రస్తుతం వైసీపీ మార్కెట్ నిర్వహణ కూడా చూసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్జేడీని కలిసి వినతిపత్రం అందించారు. అందరికీ వేలంపాటలో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అనేక తర్జన భర్జన అనంతరం అధికారులు వేలంపాటను వాయిదా వేయడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.