ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ-జనసేన తొలి జాబితాపై అభ్యర్థుల హర్షం - నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం - టీడీపీ అభ్యర్థుల జాబితా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 3:39 PM IST

TDP Leaders Response: టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాలోనే తమకు చోటు దక్కడంపై తెలుగుదేశం సీనియర్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన పొత్తుతో తమకు అదనపు బలాన్ని చేకూరుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ప్రకటనలో గత 9 ఎన్నికల్లో జరగనంత కరసరత్తు ఈ ఎన్నికలకు జరిగిందని తెలుగుదేశం నేతలు అన్నారు. సర్వేలన్నీ చేసిన తరువాతనే అభ్యర్థులను ఖరారు చేశారని తెలిపారు. 

ప్రజా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించారని వివరించారు. కోటి మందికి పైగా అభిప్రాయాలను సేకరించారని అన్నారు. చంద్రబాబు అనుభవాన్ని అంతా రంగరించి ఈ లిస్టును తయారు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. టీడీపీ- జనసేన కూటమిని అధికారంలోకి తీసుకుని వస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దుర్మార్గ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల స్పందన ఇప్పుడు చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details