జర్నలిస్టులపై, పత్రికా కార్యాలయంపై దాడి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం: టీడీపీ - Attack on Eenadu Press Office
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 3:43 PM IST
TDP Leaders Fire on MLA Katasani Rambhupal Reddy: ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అక్రమాల గురించి చిన్న పిల్లలను అడిగినా చెబుతారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత(Former MLA Gawru Charita) విమర్శించారు. కర్నూలు ఈనాడు కార్యాలయం(Kurnool Eenadu Office)పై ఎమ్మెల్యే కాటసాని అనుచరులు దాడి చేసి మూడు రోజులైనా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని తెలుగుదేశం నేతలు(TDP Leaders) మండిపడ్డారు.
TDP Leaders on Kurnool Eenadu Office Attack Issue: కర్నూలులో మీడియా సమావేశం నిర‌్వహించిన తెలుగుదేశం నాయకులు(TDP leaders Media conference in Kurnool) దాడికి పాల్పడిన అందరినీ గుర్తించామని, వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల(Journalists)పై, పత్రికా కార్యాలయంపై దాడి(Attack on Press Office) ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు.
"ఎమ్మెల్యే కాటసాని అక్రమాల గురించి చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే కాటసాని అనుచరులు దాడి చేసి మూడ్రోజులైంది. దాడికి పాల్పడిన వారిని గుర్తించాం. వారిపై చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులపై, పత్రికా కార్యాలయంపై దాడి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం." - టీడీపీ నేతలు