ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏపీ ఫైబర్‌నెట్‌లో పలు టీవీ ఛానళ్ల నిలిపివేతపై ముఖేశ్‌కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు - TDP Complaint about AP Fibernet

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 9:30 PM IST

TDP Leaders Complaint about AP Fibernet: ఏపీ ఫైబర్‌నెట్​లో పలు టీవీ ఛానళ్లు రావడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఫైబర్‌నెట్‌ నుంచి అధికార పార్టీ కుట్ర పూరితంగా తొలగించిందని టీడీపీ నేత కోనేరు సురేష్‌ ఆరోపించారు. తక్షణమే ఆ రెండు ఛానళ్లను ఏపీ ఫైబర్‌నెట్​లో ప్రసారం అయ్యేలా ఆదేశించాలని సీఈఓకి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీల ఆనవాళ్లను తొలగిస్తున్నారు. పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తీసేస్తున్నారు. అదే విధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై సైతం ఈసీ చర్యలకు తీసుకుంటోంది. వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వోను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శాఖా పరంగానూ వీఆర్వో​పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వులలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details