ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

స్ట్రాంగ్‌రూం తెరిచే సమయంలో వైఎస్సార్సీపీ నేతలు- ఫిర్యాదు చేసిన టీడీపీ - alliance leaders Complaint - ALLIANCE LEADERS COMPLAINT

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 6:21 PM IST

TDP Leaders Complain Due to YCP Leaders Open Strong Room : విజయనగరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నగరంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయంలోని పోస్టల్ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూం తెరచినపుడు సమాచారం ఇవ్వకపోవడంపై టీడీపీ నేతలు కలిశెట్టి అప్పలనాయుడు, అదితి గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం తహశీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు పోస్టల్‌ బ్యాలెట్‌ తరలింపుపై ముందుస్తు సమాచారం ఇవ్వలేదని తెలియజేశారు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ తరలింపు సమయంలో వైఎస్సార్సీపీ నేతలు స్ట్రాంగ్‌ రూంలో ఉండటం అనుమానాస్పదంగా ఉందని డీఆర్ఓ అనితకు ఫిర్యాదు చేశారు.

అనంతరం అదితి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతల సమక్షంలో అధికారులు తహసీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ తెరవడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూంని తెరిచే సమయంలో అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉండటం ఏంటని అధికారులను ప్రశ్నించారు?. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాగే సంబంధిత అధికారులకూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. ఈ వ్యవహరంపై ఎన్నికల అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కూటమి అభ్యర్ధులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details