వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాలు - TDP celebrations at Ycp office - TDP CELEBRATIONS AT YCP OFFICE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 1:03 PM IST
TDP Leaders Celebrations at YCP Office : ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ కూటమి దూసుకుపోతుండడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లో బాణాసంచా కాలుస్తూ విజయోత్సాహంలో మునిగి తెలుతున్నారు. కేకులు కోసి స్వీట్లు తినిపించుకున్నారు. నృత్యాలు చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కూటమి నేతలు ఆనందం పట్టలేక తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర పార్టీ కార్యలయం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి పార్టీ కార్యాలయం ముందు విజయోత్సాహంలో సందండి చేెశారు. రాష్ట్రంలో ఇక అరాచక పాలన అంతమందించామని నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసీపీ మూల్యం చెల్లించుకుందని కార్యకర్తలు తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఘోర పరాభవం దిశగా వెళ్తోందని వివరించారు. జగన్ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారని వెల్లడించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో కూడా కూటమికి పోటీ ఇవ్వలేకపోయిందని తెలిపారు.