ఎలక్షన్ కోడ్‌తో సంబంధం లేదు - మా పని మాదే - నెల్లూరులో ఆగని మైనింగ్ మాఫియా - mining mafia in Mogallur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 7:50 PM IST
TDP Leader Somireddy Chandra Mohan Reddy At Mogallur: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగళ్లూరులో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని టీడీపీ నాయకులతో (TDP Leaders) కలిసి సోమిరెడ్డి పరిశీలించారు.
Mining Mafia Will Not Stop Even Election Code Come: అక్రమ మైనింగ్‌కు నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులకు అడ్డాగా మారిందని, గత ఐదేళ్లుగా అడ్డగోలుగా ఇసుక, సిలికా, మట్టి, గ్రావెల్, తెల్లరాయిని తవ్వేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, చిన్నపిల్లలు గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నా జిల్లా కలెక్టర్, మైనింగ్, పోలీస్ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చినా అక్రమ తరలింపును నిలిపి వేయటం లేదని, ముడుపులు తీసుకున్న జిల్లా అధికారులు వైఎస్సార్సీపీ నాయకుల (YSRCP Leaders) ఒత్తిళ్లకు తలొగ్గి అండదండలు అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం తవ్వకాలు జరిగే ప్రాంతం అటవీశాఖ భూమిగా ఉందని, సంబంధిత అధికారులు రెవెన్యూ భూమిగా చెప్పి తవ్వేస్తున్నారని నేతలు మండిపడ్డారు. కోట్లు విలువ కలిగిన క్వార్ట్జ్ను మూడు నెలల కాలంలో తరలించారన్నారు.