ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పులివెందులనే అభివృద్ధి చేయలేని జగన్‌ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారు: రాంగోపాల్‌ రెడ్డి - టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 10:36 AM IST

TDP Leader Ram Gopal Reddy Fires on YCP Government: తన సొంత నియోజకవర్గం పులివెందులనే అభివృద్ధి చేయలేని  సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడా? అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో కిలోమీటరు కూడా వేయలేకపోయారని దుయ్యబట్టారు. ఒక చెక్ డ్యామ్ కట్టడానికి ఎన్నేళ్లు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాడా ముసుగులో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భూమిరెడ్డి ఆరోపించారు. ప్రైవేట్‌ లేఔట్స్‌కు గ్రావెల్ సరఫరా చేసి నిధులు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. ఆ ఖర్చు మెుత్తం దేనికి   వినియోగిస్తున్నారో చెప్పాలని భూమిరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.

పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కోసం వేలాది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ అభివృద్ధి పనులను పూర్తి చేయలేదు. నిర్మాణ పనుల జాప్యంపై ముఖ్యమంత్రిని అధికార యంత్రాంగం ప్రశ్నించలేకపోతుంది. 8వేల ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. కనీసం 8గృహాలను అయినా పూర్తి చేశారా? జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్క ఎకరాకైనా ఆయకట్టు నీరు అందించారా? పులివెందులనే అభివృద్ధి చేయలేని జగన్‌ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారు.-భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , టీడీపీ ఎమ్మెల్సీ

ABOUT THE AUTHOR

...view details