Live: గ్రూప్-1 అక్రమాలపై టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Pattabhi media conference Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 2:11 PM IST
|Updated : Mar 18, 2024, 2:27 PM IST
TDP leader Pattabhi media conference Live: 2018 గ్రూప్-1 అక్రమాలపై తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరాం స్పందించారు. 2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలు జరిగాయని ఇప్పటికే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 వాల్యూయేషన్లో అక్రమాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన వైఎస్సార్సీపీపై నిప్పులు చెరిగారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి 2021 డిసెంబర్ - 2022ఫిబ్రవరి మధ్య మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందనటానికి ఆధారాలు బయట పెట్టారు. వాల్యుయేషన్ ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారని మండిపడ్డారు. 2022 మార్చి 25 నుంచి మాన్యువల్ మూల్యంకనం జరిగినట్లు 2సార్లు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ (Affidavit) కూడా ఇచ్చారని దుయ్యబట్టారు. ఏపీపీస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారన్నారు. ఓసారి వాల్యూయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారని నిలదీశారు. సీతారామాంజనేయులే రెండోసారి వాల్యూయేషన్ జరపాలని లేఖ రాశారని, పైగా రెండోసారి వాల్యూయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారన్నారు. కోర్టులంటే కూడా భయం లేదని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా పట్టాభిరాం సైతం గ్రూప్- అంశంపై ప్రెస్ మీట్ పెట్టి, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Last Updated : Mar 18, 2024, 2:27 PM IST