ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సైకో జగన్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ - Kanna Allegations on CM Jagan - KANNA ALLEGATIONS ON CM JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 7:40 PM IST

Kanna Lakshminarayana Allegations on CM Jagan: రాక్షస మనస్తత్వం కలిగిన జగన్ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల్లో దొంగ ఓట్లతో అక్రమంగా గెలవాలని అనుకున్న జగన్ ప్రయత్నాలను  తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టిందని అన్నారు. మళ్లీ అధికారంలోకి రావటం కోసం రాయి దాడి నాటకం ఆడిన జగన్ నరరూప రాక్షసుడని తీవ్రంగా విమర్శించారు. 

జగన్ పాలనపై అరాచక పాలన అంతం - కూటమి పంతం పేరుతో ఎన్డీఏ ఛార్జ్ షీట్ విడుదల చేసినట్లు తెలిపారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరన్నారు. రాజధాని, పోలవరం, వరికపూడిశెల గోదావరి-పెన్నా ప్రాజెక్టులు పూర్తి చేయటం కోసం కూటమి ఏర్పడిందని అన్నారు. రాక్షస మనస్తత్వం కలిగిన జగన్​ను ఇంటికి పంపించే రోజు దగ్గర పడిందని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఇంటింటికి పింఛన్లు ఇస్తామని కన్నా తెలిపారు. జగన్ కన్నా మెరుగైన సంక్షేమ పధకాలు ఇస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details