ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గృహ నిర్మాణ పథకంతో జగన్ ప్రజలను రోడ్డున పడేశారు: జవహర్ - jawahar fires on YSRCP House Scheme

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 3:50 PM IST

TDP Leader Jawahar Fires On Jagan About Housing Scheme: ఇళ్ల నిర్మాణం (House Construction) పేరుతో జగన్ రెడ్డి పేదల్ని రోడ్డున పడేశాడని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ మండిపడ్డారు. నివాసానికి పనికిరాని ప్రదేశంలో సెంటు స్థలాలు పేదలకు ఇచ్చి, వాటిలో ఇళ్లు కట్టుకోవాలని ఒత్తిడి తెచ్చి ప్రజలను అధికార ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని జవహర్ ధ్వజమెత్తారు.

ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రతి పేద కుటుంబంపై రూ.5 లక్షల అప్పుభారం పడిందని జవహర్ తెలిపారు. ఇసుక అందుబాటులో లేకుండా చేసి, సిమెంట్, ఇనుము ధరలు పెంచి ఇళ్ల నిర్మాణం పేరుతో చివరకు పేదల్ని అప్పుల పాలు చేసిన మోసగాడు జగన్ రెడ్డి అని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి (central Gov Fund to house Construction) ఇచ్చే రూ.1.80 లక్షలతో సరిపెట్టి, రాష్ట్ర వాటాగా రూపాయి ఇవ్వకుండా చేతులు దులుపుకుంటున్నాడని జవహర్ విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details