'రాష్ట్రంలో నయా దోపిడీ పాలన- దొంగ బిల్లులు సృష్టించి దందా' - టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 2:51 PM IST
TDP Leader Dhulipalla Narendra Fire on YSRCP Govt: రాష్ట్రంలో నయా దోపిడీ పాలన నడుస్తోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ఏ మైనింగ్ నుంచి ఎంత తవ్వారో లెక్కలు ఉండవన్నారు. దొంగ బిల్లులు సృష్టించి దందా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. వాళ్లకు వచ్చే ఆదాయం 20 కోట్లు అయితే ప్రభుత్వానికి 4 కోట్ల రూపాయలు కడుతున్నారని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్‌కు నెలకు రూ.70 కోట్లు అనధికారికంగా పంపిస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు.
"రాష్ట్రంలో నయా దోపిడీ పాలన నడుస్తోంది. అధిక లోడ్‌పై వసూలు సెస్ రూ.100 ఉంటే దానిపై రూ.240 వసూలు చేస్తున్నారు. వసూలు చేసే డబ్బులకు రశీదు ఉండదు, ఒక విధానం ఉండదు. తవ్వినదానికి, ఇచ్చే బిల్లులకు ఏమాత్రం సంబంధం ఉండదు. వసూలు చేసే డబ్బుకు ప్రభుత్వానికి కట్టేదానికి సంబంధం ఉండదు. ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతూ చెక్‌పోస్టుల్లో దందా చేస్తున్నారు. సీఎం అనుచరులే వసూళ్లకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయం పడిపోయినా ఫర్వాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు." - ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ నేత