ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి గద్దెదించడమే మన లక్ష్యం: దేవినేని ఉమా - టీడీపీ నేత దేవినేని ఉమా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 10:14 PM IST

TDP Leader Devineni Uma Fires on YCP Government: అప్రజాస్వామిక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం- జనసేన సమరశంఖం జరగనుందని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో బాబు ష్యురిటి -భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలతో పాటు మినీ మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని విమర్శించారు. 24న జగన్ అక్రమ ఇసుక దోపిడీపై టీడీపీ, జనసేన ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. 

అరాచక, అవినీతి ప్రభుత్వాన్ని 165 అడుగుల గొయ్యిలో పాతిపెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీలో 11 కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంను 'బూడిద పట్నం' చేశారని ఆయన ఆక్షేపించారు. మైలవరంలో ఈ నెల 28వ తేదీన 48 కంపెనీలతో కేశినేని ఫౌండేషన్ అధినేత శివనాథ్ సారధ్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details