ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ప్రారంభమైన వైఎస్సార్సీపీ పతనం, సర్వేలతో జగన్​కి ఓటమి భయం- టీడీపీ నేత బొండా ఉమా లైవ్ - TDP Bonda Uma Press Meet Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 12:25 PM IST

Updated : Feb 9, 2024, 12:32 PM IST

TDP Leader Bonda Uma Press Meet Live: జగన్​తో లాభం లేదని ప్రజా సర్వే చెప్తుంటే, ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని టీడీపీ పేర్కొంది. ఐదేళ్లుగా జగన్​కి అందింది తాను దోచుకుంటే, ఎమ్మెల్యేలకు అందింది వాళ్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ప్రజా మద్దతు కోల్పోయిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు బదిలీ అంటున్నాడని మండిపడ్డారు. అసాధ్యమని తెలిసి కూడా ప్రజా రాజధాని అమరావతిని విశాఖకు మార్చాలని చూశారని ఆక్షేపించారు. అమరావతిపై నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నట్లుగా నేడు సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని గుర్తు చేశారు. రాజకీయ వ్యవస్థనే అపవిత్రం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదనటానికి ఎన్నో ఘటనలు ఉదాహరణలుగా ఉన్నాయని వాపోయారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం కష్టపడకుండా 5 ఏళ్లు ఎంజాయ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటం మాని, పాఠశాలలకు రంగులు కొట్టడమే అభివృద్ధి అంటున్నారని ఎద్దేవా చేశారు. నిజమైన విద్యాభివృద్ధి ఏంటో తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. బాధ్యత గల రాజకీయ నేతలంతా రామచంద్రయ్యలా ఆలోచన చేయాలని సూచించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని, సర్వేలతో జగన్​కు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ నేపథ్యంలో బొండా ఉమా మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.

Last Updated : Feb 9, 2024, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details