ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుపతి టీడీఆర్ బాండ్లలో సగానికి పైగా అవినీతే - ఆ సొమ్మంతా కక్కిస్తాం: ఆనం - తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 12:24 PM IST

TDP Leader Anam Venkata Ramana Reddy Allegations on TDR Bonds : తిరుపతిలోని 373 టీడీఆర్ బాండ్లలో సగానికి సగం అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన టీడీఆర్ బాండ్లపై ఆరోపణలు చేశారు. 18 మాస్టర్ ప్లాన్ల రోడ్లలో కాసుల వర్షం కురిసిందని, ఒక్క ఎకరానికి సుమారు 60 కోట్ల రూపాయలు తీసుకున్నారని నిప్పులు చెరిగారు. భూమికి సంబంధం లేని వారికి బాండ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. తిరుపతి రూపురేఖలు మార్చేస్తామని గొప్పలు చెప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు.

Anam Comments on TDR Bonds Scam in Tirupati : తిరుపతిలో డబ్బులు ఇస్తే ఏదైనా చేసేస్తారన్న అనుమానం కలుగుతోందని ఆనం వెంకటరమణా రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సొమ్ము లెక్కలేకుండా దోచేస్తున్నారని ఆధారాలతో చూపించినా విచారణ కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే టీడీఆర్‌ బాండ్లపై విచారణ జరిపి అవినీతితో దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details