ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలి : ఆనం రామనారాయణ రెడ్డి - TDP Leader Election Campaign - TDP LEADER ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 1:39 PM IST

TDP Leader Aanam Ramnarayana Reddy Election Campaign : రాష్ట్రానికి కూటమి అవసరం ఎంతో ఉందని ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పర్యటించారు. హత్యా రాజకీయాలతో సీఎం జగన్​ రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టించారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సోమశిల ప్రాజెక్ట్​ కింద చెరువులకు టెండర్లు పిలిచి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. ​మిగిలిపోయిన ప్రాజెక్ట్​లను పూర్తి చేయడానికే ఆత్మకూరుకు వచ్చానని ఈ సందర్భంగా తెలియజేశారు.

Anantasagaram Nellore District : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి కావాలో, పని చేతకాని వ్యక్తి కావాలో మీరే ఆలోచించుకోండి అంటూ ఓటర్లులను ప్రశ్నించారు. టీడీపీ పార్టీకి మరో అవకాశం ఇస్తే అభివృద్ది అంటే ఏంటో చూపిస్తామని ప్రజలను అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీగా గెలిపించామని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details