ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం జగన్‌పై సొంత పార్టీ నాయకులకే నమ్మకం లేదు: కొల్లు రవీంద్ర - cm jagan ongole meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 5:24 PM IST

TDP Kollu Ravindra Comments on CM YS Jagan: జగన్​పై ప్రజలే కాదు సొంత పార్టీ నాయకులు సైతం నమ్మకం కోల్పోయారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. ఒంగోలు సీఎం సభలో సగం మంది వైసీపీ నాయకులు మొహం చాటేశారని తెలిపారు. జగన్ మరోసారి అధికారంలోకి రావడానికి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో సీఎం జగన్ నేడు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 

జగన్ చెప్పినట్లు ఆడితే ఎన్నికల సంఘం చేతిలో అధికారులు బలికాక తప్పదని హెచ్చరించారు. మళ్లీ అధికారం కోసం సీఎం జగన్ తాయిలాలు ప్రకటిస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కుటుంబ విలువలు సీఎం జగన్​కి తెలియదని కొల్లు రవీంద్ర ఆరోపించారు. సొంత చెల్లిపై జగన్ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. ఇళ్ల పట్టాల పేరుతో సీఎం జగన్ తాజాగా కొత్త డ్రామా ఆడుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details