ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల ప్రచార రూపకల్పనపై కూటమి నేతల సమావేశం - మూడు పార్టీల ఉమ్మడి భేటీలు - Alliance Party Leaders Meeting - ALLIANCE PARTY LEADERS MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 9:18 AM IST

TDP- BJP-Janasena Leaders Meeting: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్‌ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, ఏప్రిల్‌ 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నివాసంలో జరిగిన ఈ భేటీలో బీజేపీ ఎన్నికల ఇంఛార్జి అరుణ్ సింగ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. 

రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టో రూపకల్పన, మూడు పార్టీల అగ్రనేతలు కలిసి పాల్గొనాల్సిన సభలు తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. అగ్రనేతల ప్రచారం అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఉండేలా ఎన్డీఏ కూటమి ప్రణాళికలు రూపొందిస్తోంది. మూడు పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విస్తృత సమన్వయమే లక్ష్యంగా ఈ సమావేశాల్ని నిర్వహించనున్నామని అచ్చెన్న తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details