లిఫ్ట్ లేదు నాణ్యత అంతంత మాత్రమే- వీఎంసీ నూతన భవన నిర్మాణంపై కూటమి కార్పొరేటర్లు ఫైర్ - VMC New Building Construction - VMC NEW BUILDING CONSTRUCTION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 8:08 PM IST
TDP and BJP Corporators Visit VMC New Building Construction : పాలన సౌలభ్యం కోసం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ ప్రాంగణంలో నిర్మిస్తున్న వీఎంసీ పాలక మండలి నూతన భవనాన్ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్పొరేటర్లు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లేదని టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించార. తొమ్మిది అంతస్తుల భవనం నిర్మించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగు అంతస్తులకు మాత్రమే స్లాబులు వేశారని తెలిపారు. కనీసం లిఫ్ట్ సౌకర్యం లేని ఈ భవనంలో వీఎంసీకి సంబంధించిన వివిధ శాఖల కార్యాలయాను ఏర్పాటు చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిలో రెండో అంతస్తు మూడు కోట్ల రూపాయలకుపైగా వెచ్చించి చేశారని, దీనిలో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించలేదని టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లు నిప్పులు చెరిగారు. నూతన భవనం నిర్మాణంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. దీనిపై నిజ నిర్థారణ కమిటీ వేసి విచారించాలని సూచించారు. ఇప్పటికైనా భవనం నిర్మాణంలో నాణ్యత పాటించి నిర్మాణ పనులు చేపట్టాలని వారు అన్నారు.