ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ కార్యకర్త దారుణ హత్య - వేట కొడవళ్లతో నరికి చంపిన వైఎస్సార్​సీపీ మూకలు - TDP Activist Brutally Murdered - TDP ACTIVIST BRUTALLY MURDERED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 10:53 AM IST

TDP Activist Brutally Murdered by YSRCP Activists: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్సార్​సీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిని వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఆయన సోదరుడు కల్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచార సమయం నుంచి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ, వైఎస్సార్​సీపీ వర్గీయుల మధ్య వైరం నెలకొనడంతో పోలీసులు గ్రామంలో బందో బస్తు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం గిరినాథ్ చౌదరి, సోదరుడు కల్యాణ్ తమ ఇంటికి వెళ్తుండగా వైఎస్సార్​సీపీ వర్గీయులు వారిపై వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. గిరినాథ్ తలపై తీవ్ర గాయమైంది. కల్యాణ్ సైతం దాడిలో గాయపడ్డారు. ఇద్దరినీ వెల్దుర్తి ఆసుపత్రికి తరలిస్తుండగా గిరినాథ్ మార్గమధ్యలో మృతి చెందారు. కల్యాణ్​ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య అనంతరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ బొమ్మిరెడ్డిపల్లికి చేరుకుని పరిశీలించారు. తిరిగి ఎలాంటి దాడులు జరగకుండా బందో బస్తు చేపట్టాలని ఎస్సై చంద్రశేఖర్రెడ్డికి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details