ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జల్లేరు దగ్గర రెండు వాహనాలు ఢీ - ఎగిసిపడ్డ మంటలు - Road Accident in Eluru District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 6:37 PM IST

Road Accident in Eluru District: ఏలూరు జిల్లాలో దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వద్ద ఓ బైక్​ను ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా, ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ లీకవటంతో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: ఖమ్మం జిల్లాకు చెందిన వీరస్వామి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై జంగారెడ్డిగూడెం వైపు వస్తున్నారు. స్థానిక జల్లేరు వద్దకు వచ్చేసరికి జంగారెడ్డిగూడెం వైపు నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం వీరాస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన వీరాస్వామిని స్థానికులు 108 అంబులెన్స్​లో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్​ నుంచి పెట్రోల్ లీకై వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details