'బాలక్‌రామ్ ప్రాణ ప్రతిష్ఠ' చూపిస్తూ ఆపరేషన్ - 'జై శ్రీరాం' అంటూ నినదించిన పేషెంట్ - వీడియోలు చూపిస్తూ ఆపరేషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 4:05 PM IST
Surgery by Showing Ayodhya Ram Pratishtha Videos: వీడియోలు చూపిస్తూ శస్త్ర చికిత్సలు చేయటంలో పేరొందిన గుంటూరు జిల్లా వైద్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈనెల 11న గుంటూరు అరండల్ పేటలోని సాయి ఆసుపత్రిలో మణికంఠ అనే వ్యక్తికి ఆపరేషన్ జరిగింది. ఈసారి అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వీడియో చూపిస్తూ ఆపరేషన్ చేశారు.
Doctors Did Operation to Patient by Showing Videos: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన ఆటోడ్రైవర్ మణికంఠ ఫిట్స్‌తో బాధపడుతున్నారు. ఆపరేషన్ చేస్తే నయమవుతుంది. అయితే మాట, చేయి పడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. మత్తులో కాకుండా మేలుకొని ఉన్న సమయంలో శస్త్రచికిత్స నిర్వహిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెప్పారు. మణికంఠకు దైవ భక్తి ఎక్కువగా ఉండటంతో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన వీడియో చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఆ వీడియోలు చూసే సమయంలో మణికంఠ 'జై శ్రీరాం' అనడం ఆశ్చర్యం కలిగించిందని వైద్యులు తెలిపారు.