ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 3:15 PM IST

ETV Bharat / videos

'వీ వాంట్‌ టీచర్‌'-​ బదిలీని రద్దు చేయాలంటూ విద్యార్థులు ధర్నా - Students Protest

Students Protest against Teacher Transfer : తాము ఎంతో అభిమానించే టీచర్​ను​ బదిలీ చేయవద్దని విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రభుత్వం పాఠశాలల్లో జరిగింది. 'వీ వాంట్‌ టీచర్‌.. 'అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక జడ్పీ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధిస్తున్న ధూళిపాళ్ల పద్మజను మరో పాఠశాలకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీని రద్దు చేయాలని కోరుతూ పదో తరగతి విద్యార్థులు ఆందోళనకు దిగారు. 

తమ అభిమాన టీచర్​ బదిలీని నిలిపివేయాలని రెండు రోజులుగా పలు విభాగాల అధికారులకు విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంపై అధికారులు స్పందించకపోవడంతో ఇవాళ విద్యార్థులు ధర్నాకు దిగారు. పద్మజ టీచర్​ వల్ల గత కొన్నేళ్లుగా పాఠశాలలో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని విద్యార్థులు ఈ సందర్భంగా తెలియజేశారు. తమ ఉపాధ్యాయురాలి బదిలీ ఆపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details