తెలంగాణ

telangana

ETV Bharat / videos

మమ్మల్ని విడిచి పోకండి సారూ - సూర్యాపేటలో విద్యార్థుల భావోద్వేగం - students Emotional For sir transfer

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 6:58 PM IST

School Students Become Emotional For Their Teacher Transfer : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం హేమ్లతండాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. తమకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్తున్న విషయం తెలిసి విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. గ్రామంలో షేక్ మస్తాన్ తొమ్మిదేళ్లుగా హిందీ బోధిస్తూనే ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. వృత్తినే పవిత్రంగా భావించి పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది జిల్లాలోని అధిక ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న పాఠశాలగా చేసి ప్రశంసలు పొందాడు. 

కనీస సదుపాయాలు లేని పాఠశాలకు దాతల సహాయంతో అనేక సౌకర్యాలు వచ్చేలా కృషి చేశారు. వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించేవారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన మస్తాన్ సోషల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొంది తొగర్రాయి వెళ్తున్న సందర్భంగా విద్యార్థులు తమ భావోద్వేగాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చేశారు. ఉపాధ్యాయుడు, మిగతా టీచర్లు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు మాత్రం ఏడుస్తూనే ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details