ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

12 మంది టీచర్లకు నలుగురే ఉన్నారు- మా ఉపాధ్యాయులను ఇవ్వండి - No Teachers in school

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 9:59 PM IST

Students Agitation due to Lack of Teachers in School at Prakasam District : పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత ఉందని విద్యార్థులు ఆందోళన చేసిన ఘనట ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం అంబవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండేళ్లుగా ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులు పాఠ్యపుస్తకాలను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, పాఠశాలలో 12 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిఉండగా కేవలం నాలుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. కేవలం తెలుగు, పీఎస్ క్లాసులు తప్ప ఇతర సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులు లేరని వెల్లడించారు. దీంతో పాఠాలు అర్థంగాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. 

రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై గతంలో పలుమార్లు ప్రధానోపాధ్యాయుడు, పై అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యార్థులు పదోతరగతి కావడంతో ప్రధాన పరీక్షలో మార్కులు తక్కువగా వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వామైన ఉపాధ్యాయుల ఖాళీలను త్వరగతిన పూర్తిచేసి తమ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details