ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆ రిజర్వాయర్​లో పడి మూడు రోజుల్లో ఇద్దరు మృతి- పోలీసుల చర్యలేవి? - Student Dead Swim in Reservoir

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 10:57 PM IST

Student Dead After Going Swim in Reservoir : విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం రిజర్వాయర్​లో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. సరదాగా స్నేహితులతో గడుపుదామని వెళ్లిన యువకుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గంభీరం రిజర్వాయర్​కు వెళ్లారు. హితేష్ అనే యువకుడు రిజర్వాయర్​లో దిగగా లోతు ఎక్కువగా ఉండటంతో ఈత కొట్టడానికి ఇబ్బంది పడి మునిగిపోయాడు. అతని స్నేహితులు వెంటనే రక్షించడానికి ప్రయత్నించిన సాధ్యపడలేదు. కళ్లముందే హితేష్​ చనిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.  

స్నేహితుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే రిజర్వాయుర్​లో రెండు రోజుల క్రితం జారిపడి ఓ విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details