ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఓ వైపు తల్లి మరణం - మరోవైపు భవిష్యత్​ - బాధను దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరు - Student Attend to SSC Exam - STUDENT ATTEND TO SSC EXAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 4:53 PM IST

Student Appearing for 10 Class Exam After his Mother Died: ఓ వైపు తల్లి మరణం - మరోవైపు భవిష్యత్తు కోసం పరీక్షలు. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ విద్యార్థిది. తల్లి మరణాన్ని దిగమింగి పరీక్షకు హాజరై ఆ తరువాత తన తల్లి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ఆదోని ఇందిరా నగర్​లో రాజు, జయమ్మ రెండవ కుమారుడు వీరాస్వామికి పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే తన తల్లి అకస్మాత్తుగా మృతి చెందింది. ఆ విద్యార్థి తల్లి మరణం దిగిమింగి విద్యార్థి ఈ రోజు జరిగిన పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఇంట్లో తల్లి మృతదేహం, కుటుంబ సభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయినా పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశాడు. పరీక్ష అనంతరం ఇంటికి వచ్చి తల్లి అంతక్రియలు చేశాడు. ఈ విషాదకర ఘటనతో కాలనీలో అందరి మనుసు కలిచి వేసింది.

ABOUT THE AUTHOR

...view details