డీమ్డ్ యూనివర్సీటీ హోదా పొందిన సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల - Siddhartha Engineering College
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 9:09 PM IST
Status of Siddhartha Engineering College as Deemed to be University Institution : విజయవాడలోని వెలగపూడి రామకృష్ణ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీగా హోదా దక్కిందని కళాశాల ప్రతినిధులు వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ నుంచి తమకు సమాచారం వచ్చిందని కళాశాల యాజమాన్యం వెల్లడించింది. డీమ్డ్ యూనివర్శిటీ అనేది దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు సంబంధిత మంత్రిత్వ శాఖ ద్వారా మంజూరు చేయబడిన అక్రిడిటేషన్. ఇటువంటి ప్రతిష్ఠాత్మక హెూదా దక్కడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
డీమ్డ్ యూనివర్సీటీ హోదా దక్కిన స్ఫూర్తితో తమ కళాశాలలో మరిన్ని విభాగాలతో పాటు, సాంకేతిక నైపుణ్య విద్యను మరింత అభివృద్ధి చేస్తామని కళాశాల అధ్యాపక బృందం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని తమ సంస్థలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తించబడిన సమర్థవంతమైన నాణ్యత గల బోధన, పరిశోధనలను తమ కళాశాలలో చేరే విద్యార్థులకు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.