ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ హయాంలో అస్తవ్యస్తమైన ఇసుక విధానం - రేపు శ్వేతపత్రం విడుదల - white paper on sand - WHITE PAPER ON SAND

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 4:02 PM IST

State Government Tomorrow Will Release White Paper on Sand : ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం రేపు శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం అస్తవ్యస్తంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకంతో లక్షలాది మంది బేల్దారులు, కూలీలు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ఈ పరిస్థితులను గమనించిన చంద్రబాబు, ముఖ్యమంత్రి కాగానే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. 

ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. లారీలు, ట్రాక్టర్లు ఇసుక రీచ్‌లకు క్యూ కట్టాయి. వ్యాపారులు, కొనుగోలుదారులతో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద కోలాహలం నెలకొంది. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. చాలా జిల్లాల్లో ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు ప్రారంభించారు. భవన నిర్మాణ రంగం పూర్వవైభవం సంతరించుకుంటుందని చేతినిండా పని దొరుకుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను వివరిస్తూ, పరిపాలనలో పారదర్శకత కోసం మెుత్తం ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిశ్చయించింది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈరోజు ఇంధనశాఖపై మరో శ్వేతపత్రం విడుదల చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details