ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నాలుగు నెలలుగా నిలిచిన వేతనాలు- శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మె - శ్రీ రామ్‌రెడ్డి తాగునీటి పథకం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 1:40 PM IST

Sriram Reddy Drinking Water Scheme Workers Protest in Anantapur : తమ సమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ రామ్‌రెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మెకు దిగారు. తమకు చెల్లించాల్సిన నాలుగు నెలల వేతన బకాయి సహా P.F. చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను అధికార నేతల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె (Strike)కు దిగిన కార్మికులకు సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు.  

గత నెలలో 20 రోజులకు పైగా సమ్మె చేస్తే అనంతపురం(Anantapuram) ఎంపీ రంగయ్య తన అనుచరులతో వచ్చి రెండు నెలల వేతనం గుత్తేదార్లతో ఇప్పించామని దౌర్జన్యంగా మోటార్లను ఆన్ చేశారని, అయితే ఆ తర్వాత తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి తర్వాత కార్మికులు మోటార్లను ఆపేశారు. మరో గుత్తేదారు కొత్తగా వచ్చానని తిరిగి మోటార్లను ఆన్ చేయడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు తిరిగి పంపుహౌస్​ను చుట్టుముట్టి సమ్మెకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details