ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: భద్రాద్రి నుంచి శ్రీ సీతారాముల కల్యాణం - ప్రత్యక్ష ప్రసారం - Sri Rama Navami Celebrations - SRI RAMA NAVAMI CELEBRATIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 10:09 AM IST

Updated : Apr 17, 2024, 1:05 PM IST

Sri Rama Navami 2024 Celebrations at Bhadrachalam Live : భక్త కోటి వేయికళ్లతో ఎదురుచూసే శ్రీ సీతారాముల కల్యాణం తెలంగాణలోని భద్రాద్రిలో కనుల పండుగగా జరుగుతుంది. అందుకు భద్రాచలాన్ని ఆలయ అధికారులు సుందరంగా ముస్తాబు చేశారు. భద్రాద్రి పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కల్యాణ ఘట్టం జరిగిన మిథిలా ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. అభిజిత్​ నగ్నమందు శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ అభిజిత్​ నగ్నమందే జీలకర్ర బెల్లాన్ని సీతారాముల తలపై పెడతారు.కమనీయంగా సాగే కల్యాణ వేడుకకు ప్రతి ఏటా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించింది. ఈసారి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాములవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, ఫ్యాన్లు, కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. సుమారు రెండు వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తును పోలీసు శాఖ ఏర్పాటు చేసింది.
Last Updated : Apr 17, 2024, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details