తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆస్తులు పంచుకుని అమ్మను వదిలేశారు - అందరూ ఉండి అనాథను చేశారు - Son Left his Mother on Road - SON LEFT HIS MOTHER ON ROAD

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 1:49 PM IST

Updated : Aug 30, 2024, 3:03 PM IST

Son Left his Mother on Road : కనిపెంచిన తల్లిపై కనికరం లేకుండా ప్రవర్తించాడు ఆ కుమారుడు. నవ మాసాలు మోసి, కని, పెంచిన మాతృమూర్తి పట్ల దయ లేకుండా వ్యవహరించాడు. కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు, ఇంట్లో నుంచి గెంటేసిన అమానవీయ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుంట సత్తవ్వ అనే వృద్దురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇద్దరు కుమారుల్లో ఒకరు మృతి చెందగా, మరో కుమారుడు మెదక్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఉన్న కుమారుడైనా తన బాగోగులు చూసుకుంటాడనుకుంటే, కనీసం కనికరమైనా చూపకుండా ఇంటి నుంచి తరిమేశాడని ఆ తల్లి భార హృదయంతో బోరున విలపిస్తోంది. తాను సంపాదించిన భూమిని తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచానని సత్తవ్వ చెబుతోంది. తన దగ్గరున్న బంగారాన్ని సైతం వారు లాక్కున్నారని, ఇంటి నుంచి గెంటి వేయడంతో తాను రోడ్డు మీద బతికే పరిస్థితి ఏర్పడిందని విలపించింది.

Last Updated : Aug 30, 2024, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details