ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ. 3 కోట్లతో చాయ్, సమోసాలా? తిరుపతి మున్సిపాలిటీలో స్నాక్స్ స్కామ్​పై విచారణకు రాయల్​ కిరణ్ డిమాండ్ - Snacks Scam in Tirupati

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 5:55 PM IST

Updated : Aug 4, 2024, 6:16 PM IST

Snacks Scam in Tirupati Municipal Corporatio (ETV Bharat)

Snacks Scam in Tirupati Municipal Corporation : రాష్ట్రంలో వైసీపీ పాలనలో ల్యాండ్, వైన్, మైనింగ్ స్కామ్​లాగే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో భారీ స్నాక్స్ స్కామ్ జరిగిందని జనసేన నేతలు ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ, కేవలం చాయ్, సమోసా లాంటి చిరుతిళ్ల కోసమే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 3 కోట్ల రూపాయలను ఖర్చుచేశారని విమర్శించారు. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే చిరుతిండ్ల కుంభకోణం జరిగిన విషయాన్ని నిర్ధారించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలు చూసిన జనం కొత్తగా చిరుతిండ్లలో అవినీతిని చూస్తున్నారన్నారు. 

అలాగే వివిధ శాఖల అధికారుల ఇంట్లోని అవసరాల కోసం 90 మంది ఉద్యోగులను నియమించి 25 నెలల పాటు జీతాలు చెల్లించినట్లు ధ్వజమెత్తారు. అదేవిధంగా రూ.2కోట్ల విలువైన డబుల్‌ డెక్కర్‌ బస్సును చెత్తకుప్పల మధ్య పెట్టారని మండిపడ్డారు. దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజాధనాన్ని వైసీపీ నేతలు, అధికారులు దుర్వినియోగం చేశారన్నారు. స్నాక్స్ స్కాం, 90మంది నియామకాలపైన విచారణ జరిపించాలని జనసేన నేతలు డిమాండ్‍ చేశారు.

Last Updated : Aug 4, 2024, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details