తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఏరో స్పేస్‌ రంగంలో అమ్మాయిలకు శిక్షణ - కల్పనా ఫెలోషిప్ ద్వారా ఇంటర్న్‌షిప్‌

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 3:55 PM IST

Skyroot Co Founder Bharat Interview :  ఆకాశం అంచులు తాకాలి అంతరిక్ష రహస్యాలు తెలుసుకోవాలి ఇలాంటి ఆశలు, ఆకాంక్షలు అమ్మాయిలకు ఉన్నా ఏరో స్పేస్ రంగంలోకి అడుగుపెట్టే వారి సంఖ్య చాలా తక్కువ. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంతరిక్షంలో భారత్ సాధిస్తున్న విజయాల దృష్ట్యా ఈ వైపు అడుగులు వేయడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి అవకాశాలున్నా ఆర్థిక ఇబ్బందులు, అసమానతలు వెంటాడుతుంటాయి. మరి కొందరికి స్పేస్​ ఫీల్ట్​ వైపు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై అవగాహన లేకపోవడం మరోక కారణం. 

Skyroot Aerospace Kalpana Fellowship : అలాంటి మహిళలకు అంతరిక్ష రంగంలో చోటు కల్పించడానికి స్కైరూట్ ఏరోస్పేస్‌ సంస్థ సిద్ధమైంది. కల్పనా ఫెలోషిప్ పేరుతో ఇంటర్న్‌షిప్‌ నిర్వహిస్తుంది. బీటెక్​, ఎస్​టెక్​ పూర్తి చేసిన వారు దీనికి అర్హులని పేర్కొంది. మరి, దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? శిక్షణ విధానం ఎలా ఉంటుంది? తదితర అంశాలను స్కైరూట్ కో ఫౌండర్ భరత్ మాటలలోనే తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details