LIVE : హైదరాబాద్లో సిరాజ్ విజయోత్సవ స్వాగత ర్యాలీ - ప్రత్యక్షప్రసారం - Siraj welcome rally in Hyderabad - SIRAJ WELCOME RALLY IN HYDERABAD
Published : Jul 5, 2024, 7:10 PM IST
|Updated : Jul 5, 2024, 7:48 PM IST
LIVE : టీ20 ప్రపంచ కప్ సభ్యుడైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సిరాజ్ను ఘనంగా అతని ఇంటికి తీసుకువెళ్తున్నారు. మెహదిపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి ఈద్గా వరకు భారీ స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీలో వేలాది మంది నగరవాసులు, సిరాజ్ అభిమానులు హాజరయ్యారు. మహ్మద్ సిరాజ్ కి స్వాగతం పలికేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులతో రహదారులు కిక్కిరిసిపోయాయి. నిన్న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ నుంచి ఘన సత్కారం అందుకున్న సిరాజ్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రపంచ క్రికెట్ కప్ కోసం దాదాపు 11 సంవత్సరాల కల సహకారమైందని సిరాజ్ అన్నారు. టి20 ప్రపంచ కప్ గెలవడం హైదరాబాద్ కు గర్వకారణమని సిరాజ్ అన్నారు. రానున్న రోజుల్లో ఇండియాకు మరిన్ని పథకాలు సాధించే విధంగా కృషి చేస్తానని అన్నారు. సిరాజ్ విజయోత్సవ స్వాగత ర్యాలీని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం..
Last Updated : Jul 5, 2024, 7:48 PM IST