పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ - Shock to Ex Minister peddireddy - SHOCK TO EX MINISTER PEDDIREDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 6:46 PM IST
Shock to Peddireddy Ramachandra Reddy: చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరు పరిధిలో వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు రాజీనామా చేశారు. పార్టీతో పాటు తమ పదవులకు సైతం రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు.
పులిచెర్ల జడ్పీటీసీ పదవికి మురళీధర్, పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశిప్రసాద్, ఈశ్వరి రాజీనామా చేశారు. వారితో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సర్పంచులు ఆ పార్టీ సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోకపోవడం వల్లే పార్టీని వీడినట్లు తెలిపారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల అండలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రాజీనామా సందర్భంగా ఆ పార్టీ నేతలు తెలిపారు. అయితే ఇటీవలే పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు 12 కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా పులిచెర్ల మండలంలోని పలువురు నేతలు కూడా వైఎస్సార్సీపీని వీడటంతో పాటు తమ పదవులకు సైతం రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.