శాకాంబరీ అలంకారంలో బల్కంపేట ఎల్లమ్మ - మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు - Shakambari Utsavalu In Balkampet - SHAKAMBARI UTSAVALU IN BALKAMPET
Published : Jul 23, 2024, 7:53 PM IST
Shakambari Utsavalu In Balkampet Yellamma Temple : హైదరాబాద్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు శాకంబరీదేవీ రూపంలో దర్శనమిచ్చారు. వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో ఆలయ అర్చకులు అమ్మవారిని అలంకరించారు. ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. కాంగ్రెస్ టీపీసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
జీవకోటికి ఆకలిని తీర్చిన శాకాంబరీ దేవిని పూజారులు ఐదుటన్నుల వివిధ కూరగాయలతో అలంకరించారు. ఆషాడ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడి పంటలకు లోటుండదని ప్రజల విశ్వాసం. ఏ కోరికైనా మొక్కుతే అమ్మ తన కొంగు బంగారం చేస్తుందని భక్తులు కొనియాడారు. అందరూ ఆషాఢ మాసంలోనే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయానికి వచ్చిన భక్తులు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.