ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చిన తిరుపతి శ్రీవారి దర్శనానికి భక్తుల అవస్థలు- సాంకేతిక సమస్యతో గంటల తరబడి క్యూలైన్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 5:21 PM IST

Server Problem in Dwaraka Tirumala: చిన వెంకన్నగా పేరుగాంచిన ద్వారక తిరుమల భక్తులతో పొటెత్తింది. తిరుపతి వెంకన్న మెుక్కులు కూడా ద్వారక తిరుమలలో తీర్చుకోవచ్చనే సంప్రదాయం ఉండటంతో రోజురోజుకూ భక్తుల తాకిడి ఎక్కువ అవుతోంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు గంటల తరబడి క్యూలైన్లో పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వర్ డౌన్‌ అవడంతో టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో(Queue) వేచి ఉన్నారు. ఈరోజు శనివారం కావటంతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 

ఆలయంలో సర్వర్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో కేశ ఖండనశాల, ప్రసాదాల కౌంటర్ల వద్ద క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడ్డారు. దీంతో అధికారులు మాన్యువల్ పద్ధతిలో టికెట్లు అందించటంతో భక్తులకు కొంత ఉపశమనం లభించింది. అలాగే టోల్​ గేట్ (Toll Gate) వద్ద వాహనాలు నిలచి పోవడం వల్ల ఆప్రాంతం రద్దీగా మారింది. 

ABOUT THE AUTHOR

...view details