ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సచివాలయ సిబ్బంది సాహసం - గెడ్డలు దాటి పింఛన్లు పంపిణీ - అభినందించిన అధికారులు - Distribute Pensions in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 10:20 AM IST

Updated : Aug 3, 2024, 1:09 PM IST

Secretariat staff Distribute pensions Beyond streams (ETV Bharat)

Secretariat staff Distribute pensions Beyond streams : అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల కొండ ప్రాంతాల్లో గిరిజనులకు సకాలంలో ఒకటో తేదీన పింఛన్లు అందించేందుకు ప్రభుత్వ సిబ్బంది సాహసం చేశారు. మారుమూల పెదబయలు మండలం ఇంజరీ, జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల పరిధిలో 20 గ్రామాలకు పింఛన్లు ఇచ్చేందుకు సచివాలయ సిబ్బంది డబ్బులు చేత పట్టుకుని ప్రమాదకర వాగులో గెడ్డలు దాటి పింఛన్లు పంపిణీ చేశారు. 

గిన్నెలకోట పంచాయతీలో తొమ్మిది గ్రామాలు గెడ్డకు అవతలవైపు ఉండడంతో సచివాలయ సిబ్బంది తాడు సహాయంతో గెడ్డను దాటి వెళ్లి ఆయా గ్రామస్థులకు పింఛను అందించారు. జామిగుడ పంచాయతీలో గెడ్డకు అటు వైపు ఉన్న 6 గ్రామాల ప్రజలకు సిబ్బంది ప్రమాదకరంగా గెడ్డ దాటెళ్లి పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు. ప్రాణాలకు తెగించి పింఛన్లు పంపిణీ చేసిన సిబ్బందిని అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఒకటవ తేదీనే పింఛన్లు ఇచ్చేలా ముందస్తుగా జిల్లా అధికారుల ఆదేశించారు. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా ఒకటో తేదీన 97% వరకు పెంచిన పంపిణీ చేసి నిబద్దత నిరూపించుకున్నారు. జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బందీని రాష్ట్ర అధికారులు అభినందించారు.

Last Updated : Aug 3, 2024, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details