తెలంగాణ

telangana

ETV Bharat / videos

కారులో వచ్చి, గ్యాస్​ కట్టర్​తో ఏటీఎం కొల్లగొట్టి - రూ.30 లక్షల చోరీ! - SBI Atm Robbery

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 2:20 PM IST

SBI Atm Robbery In Mahabubabad : మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి కారులో వచ్చిన కొంతమంది వ్యక్తులు, గ్యాస్ కట్టర్​తో ఏటీఎం మిషన్​ను ధ్వంసం చేసి, భారీ మొత్తంలో నగదును దొంగిలించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ క్లూస్​ టీమ్​తో సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కాగా ఈ శుక్రవారం సాయంత్రం ఈ ఏటీఎంలో రూ.29 లక్షలను పెట్టినట్లు సమాచారం.

ఈ సంఘటనపై అడిషనల్ ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ అర్ధరాత్రి కారులో ఐదుగురు వ్యక్తులు వచ్చి గ్యాస్ కట్టర్​తో ఏటీఎం ధ్వంసం చేసి రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు చోరీ చేశారని తెలిపారు. వీరంతా ప్రొఫెషనల్ గ్యాంగ్​కు సంబంధించిన వారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దొంగలను పట్టుకొని సొమ్మును రికవరీ చేస్తామని చెప్పారు. మేడారం జాతరకు వెళ్లేటప్పుడు ఇళ్లలో విలువైన బంగారం, డబ్బులను ఉంచుకోవద్దని, జాతరలో కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details