వీనుల విందుగా అఖండ కచ్ఛపీ మహోత్సవం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 1:43 PM IST
Sangeetha Kacheri in Ghantasala Venkateswara Rao Govt Music College at Vijayawada : విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వేదికగా శ్రీ సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి ఆధ్వర్యంలో సప్తమ వార్షిక అఖండ కచ్ఛపీ మహోత్సవం వీనుల విందుగా సాగుతోంది. వీణానాదం వీక్షకులను తన్మయులను చేస్తోంది. త్యాగరాజ పంచరత్న కీర్తనలతో వీణా వాద్య సమ్మేళనాన్ని కళాకారులు ప్రారంభించారు. పదుల సంఖ్యలో కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారు 12 గంటలపాటు నిరాటంకంగా వీణ కచేరీని (Veena Kacheri) నిర్వహిస్తున్నారు. నానాటికీ వీణ కళాకారుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో కళాకారుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా కొత్త కళాకారులను తీర్చిదిద్దేందుకు ఏటా ఫిబ్రవరి15న అఖండ కచ్చపీ (Akhanda Kachhapi) మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మొట్టమొదటి సంగీత వాద్యపరికరమైన వీణ (Veena) ప్రాశస్త్యాన్ని, మన సంస్కృతి, వారసత్వాన్ని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని వక్తలు అభిప్రాయపడుతున్నామన్నారు.