తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పుష్ప' స్టైల్​లో గంజాయి స్మగ్లింగ్ - సంగారెడ్డి జిల్లాలో రూ.35 లక్షల విలువైన సరకు సీజ్ - GANJAYI SEIZED IN SANGAREDDY - GANJAYI SEIZED IN SANGAREDDY

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 4:42 PM IST

Ganjayi Smuggling in Sangareddy : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి వద్ద పోలీసులకు భారీగా గంజాయి చిక్కింది. బొలెరో పికప్ వాహనంలో తరలిస్తున్న 140 కిలోల గంజాయిని పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ రూపేశ్ పట్టుబడిన గంజాయి వివరాలను వెల్లడించారు.

 ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్ గిరి నుంచి జహీరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తుండగా దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.35 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. పుష్ప సినిమా తరహాలో బొలెరో పికప్ వ్యాను వెనుక భాగంలో గంజాయి దాచి పైన సిమెంటు కాంక్రీట్ వేసి గుట్టుగా తరలిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన  ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details