ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అధికారుల సైకో ఇజం: టీడీపీ నేతలు ఓట్లు అభ్యర్థించారని- విశ్రాంత ఉద్యోగుల షెడ్డులను కూల్చే యత్నం - RTC employees support to YCP - RTC EMPLOYEES SUPPORT TO YCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 7:46 PM IST

Updated : Apr 28, 2024, 10:48 PM IST

RTC Employees Support to YCP Leaders in Guntakal : వైఎస్సార్సీపీ నాయకులకు ఆర్టీసీ అధికారులు కొమ్ముకాస్తున్నారు. టీడీపీ నాయుకులు ఓట్లు అభ్యర్థించారన్న కారణంతో  విశ్రాంత ఉద్యోగులు ఉంటున్న షెడ్డుని కూల్చే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో గత నాలుగేళ్లుగా చందాలు వేసుకుని ఏర్పాటు చేసుకున్న షెడ్డులో విశ్రాంత ఉద్యోగులు వారి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ స్వామి విశ్రాంత ఉద్యోగులు ఉన్న షెడ్డులోకి వెళ్లి టీడీపీకు ఓటు వేయాలని అభ్యర్థించారు. 

Retired RTC Employees Houses : విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ఆర్టీసీ డిపో మేనేజర్ నారాయణస్వామికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన విశ్రాంత ఉద్యోగులు ఉన్న షెడ్డును పడగొట్టాలంటూ డిపో మేనేజర్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జేసీబీతో షెడ్యూల్ కూల్చేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి సోదరుడు నారాయణస్వామి, నాయకులు, అధికారులను నిలదీయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం నాయకులతో తాము ఎటువంటి సమావేశాలు నిర్వహించలేదని విశ్రాంత ఉద్యోగులు తెలిపారు.

Last Updated : Apr 28, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details