రాష్ట్రంలో పెరుగుతోన్న విదేశాలకు వెళ్లే వారి సంఖ్య - పాస్‌పోర్ట్ కోసం ఇవి పాటించాలంటున్న సికింద్రాబాద్ ఆర్పీవో - PASSPORT ISSUES in telangana
Published : Apr 13, 2024, 2:11 PM IST
RPO Snehaja Interview On Passport Issues : జీవన ప్రమాణాలు మారుతున్న కొద్దీ విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారు కొందరైతే, ఉద్యోగాల కోసం ఇంకొందరు, పర్యటనల కోసం మరికొందరు పొరుగు దేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో పాస్‌పోర్ట్‌ల డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతుంది. ఒక్క రోజే 4,000 మందికి పైగా ఇందుకోసం దరఖాస్తు చేస్తున్నారంటే, డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో కొందరు తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తున్నారు. దీంతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా కీలకం అవడంతో ఇది జారీ ఆలస్యం అవుతుందనే ఆరోపణ ఉంది. మరి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు సాధారణ పాస్‌పోర్ట్, తత్కాల్ పాస్‌పోర్ట్‌ల జారీ ఎన్ని రోజుల సమయం పడుతుంది. అనే వివరాలను సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జే.స్నేహజ మాటల్లో తెలుసుకుందాం.