ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కేజీ బేసిన్‌లో లభించే ఉత్పత్తులపై రాష్ట్రానికి హక్కు కల్పించాలి: చమురు, గ్యాస్ సాధన సమితి - Meeting on Krishna Godavari Basin - MEETING ON KRISHNA GODAVARI BASIN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 4:43 PM IST

Round Table Meeting on Krishna Godavari Basin: కృష్ణా గోదావరి బేసిన్‌లో లభించే ఉత్పత్తులపై రాష్ట్రానికి పన్నులు విధించే హక్కు కల్పించాలని చమురు, గ్యాస్ సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు చమురు, సహజవాయువులపై రాష్ట్రం పన్నులు విధించుకునే హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో చమురు, గ్యాస్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

కృష్ణా గోదావరి బేసిన్​లో లభ్యమయ్యే ఉత్పత్తులు ముందుగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు తరలించాలన్నారు. ఏ రాష్ట్రంలో లభించే సహజ వనరులపై ఆ రాష్ట్రానికి హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలోని కేజీ బేసిన్​పై హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే సహజ వనరుల్లో వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని సమితి నాయకులు సూచించారు. ఇక్కడి సహజవనరులపై ప్రజలకు హక్కు ఉండాలని విజయవాడలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్ సమావేశంలో కోరారు. 

ABOUT THE AUTHOR

...view details