అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - అక్కడికక్కడే ముగ్గురు మృతి - Road Accident - ROAD ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 6:43 PM IST
Road Accident in Anakapalli District : అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖ నుంచి కారు తుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Three People Died in Road Accident : ప్రమాద స్థలంలో కారులో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. మృతులు విశాఖనగరం గోపాలపట్నం వాసులుగా గుర్తించారు. వీరంత ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.