మేదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 7:09 PM IST
Road Accident at Medarmetla National Highway: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు నుంచి విజయవాడకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఒంగోలు వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం మేదరమెట్ల వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన కోరంపల్లి ఆంజనేయులు (50)అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
One Person Dead With Road Accident: ఎదురుగా వచ్చి ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణమేంటని ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.