ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన- ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష - రిటైర్డ్ ఎంప్లాయిస్ నిరాహార దీక్ష

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 3:48 PM IST

Retired Employees Protest in Ongole District : పదవీ విరమణ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ప్రకాశం జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ డిమాండ్ చేశారు. ఆల్‌ పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (All Pensioners Retired Employees Association) ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Retired Employees Protest : ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీసం రూ.10000 ఇవ్వాలని అన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వేలు గతంలో ఇచ్చిన ప్రయాణ రాయితీలను పునరుద్దించాలని చెప్పారు. ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో నగదు రాయితీ వైద్యం అందరికీ అన్ని చోట్ల అందించాలని చెప్పారు. ప్రభుత్వం వారికున్న 11 డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details