ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌కు పోటెత్తిన భూ బాధితులు - ఫిర్యాదులు స్వీకరించిన సిసోదియా - Receiving Complaints in Madanapalle - RECEIVING COMPLAINTS IN MADANAPALLE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 6:04 PM IST

Receiving Complaints from Land Victims in Madanapalle: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌కు భూ బాధితులు పోటెత్తారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియాకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్​సీపీ హయాంలో తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు. 

ప్రిన్సిపల్ సెక్రెటరీ సమీక్ష: ఇప్పటికే ఘటనకు సంబంధించి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పీ సిసోడియా జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో పాటు ఆర్డీవోలు తహశీల్దార్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 100 మందికి పైగానే రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆ మండలాలకు సంబంధించిన వివరాలతో సమావేశాన్ని హాజరయ్యారు. కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లు కాలిపోయిన ఘటనలు సంబంధించి మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కార్యాలయాల వద్ద నిఘా పెంచాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details